Breaking News

డీఆర్‌డీఓ సైంటిస్ట్‌-బి పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల

డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్నైజేషన్‌ (డీఆర్‌డీఓ) వివిధ విభాగాల్లో 185 సైంటిస్ట్‌-బి పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలచేసింది. ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు, సైన్స్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చదువుతున్నవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్ఛు ఎంపికైనవారికి రూ.80 వేల వరకు వేతనం లభిస్తుంది. రక్షణ విభాగానికి చెందిన పరిశోధన, అభివృద్ధి కేంద్రాల్లో వీరు సేవలు అందిస్తారు. గేట్‌ స్కోర్‌, డిస్క్రిప్టివ్‌ పరీక్ష, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభతో నియామకాలు చేపడతారు.

విభాగాలవారీ ఖాళీలు

శాస్త్రవేత్తలుగా.. దేశ రక్షణలో!ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ 41, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ 43, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ 32, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ 12, మెటలర్జికల్‌ ఇంజినీరింగ్‌/ సైన్స్‌ 10, ఫిజిక్స్‌ 8, కెమిస్ట్రీ 7, కెమికల్‌ ఇంజినింగ్‌ 6, ఏరో నాటికల్‌ ఇంజినీరింగ్‌ 9, మ్యాథమేటిక్స్‌ 4, సివిల్‌ ఇంజినీరింగ్‌ 3, సైకాలజీ 10.

అర్హత: సంబంధిత విభాగంలో ప్రథమ శ్రేణితో బీటెక్‌ లేదా ఎమ్మెస్సీ. సైకాలజీ పోస్టుకు నెట్‌లో అర్హత సాధించాలి. మిగిలిన అన్ని పోస్టులకూ సంబంధిత విభాగాల్లో గేట్‌ స్కోర్‌ తప్పనిసరి. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్ఛు గేట్‌ 2018, 2019, 2020 స్కోర్లు చెల్లుబాటవుతాయి. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగాల పోస్టులకు ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో సంబంధిత కోర్సులను 80 శాతం మార్కులతో పూర్తిచేసుకున్నవారు గేట్‌ స్కోర్‌ లేకపోయినా దరఖాస్తు చేసుకోవచ్ఛు

వయసు: అన్‌-రిజర్వ్‌డ్‌ అభ్యర్థులకు 28, ఓబీసీ ఎన్‌సీ వారికి 31, ఎస్సీ, ఎస్టీలకు 33 ఏళ్లలోపు ఉండాలి.

ఎంపిక విధానం

ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగాల పోస్టులకు డిస్క్రిప్టివ్‌ పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. మిగిలిన వాటికి ఇంటర్వ్యూ ద్వారా ఎంపికలు చేపడతారు. వచ్చిన దరఖాస్తులను పరీక్ష/ గేట్‌/ నెట్‌ స్కోర్‌ ప్రకారం షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. పరీక్ష ఉన్న పోస్టులకు ఒక్కో ఖాళీకి 25 మందిని చొప్పున గేట్‌ మెరిట్‌ ప్రకారం అవకాశం కల్పిస్తారు. ఇంటర్వ్యూకు అన్ని విభాగాల్లోని పోస్టులకూ ఒక్కో ఖాళీకి 5 మందిని చొప్పున గేట్‌/నెట్‌ మెరిట్‌ ప్రకారం పిలుస్తారు.

వెయిటేజీ: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగాల పోస్టులకు డిస్క్రిప్టివ్‌ పరీక్షకు 80 శాతం, ఇంటర్వ్యూకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. మిగిలిన పోస్టులకు గేట్‌/నెట్‌ స్కోర్‌కు 80 శాతం, ఇంటర్వ్యూకు 20 శాతం వెయిటేజీ లెక్కిస్తారు.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్ఛు ఫీజు రూ.వంద. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు ఫీజు చెల్లించనవసరం లేదు. ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో ప్రకటన వెలువడినప్పటి నుంచి 21 రోజుల వరకు దరఖాస్తు స్వీకరిస్తారు.

ఎంపికైనవారికి రూ.56,100 మూలవేతనం అందుతుంది. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ అదనంగా ఉంటాయి. అన్నీ కలిపి మెట్రో సిటీల్లో సేవలందించినవారికి మొదటి నెల నుంచే రూ.80 వేలు లభిస్తాయి. దేశవ్యాప్తంగా యాభైకి పైగా ఉన్న డీఆర్‌డీవో కేంద్రాల్లో ఎక్కడైనా వీరు సేవలు అందించాల్సి ఉంటుంది. ఉద్యోగంలో ప్రతిభను ప్రదర్శించిన వారికి మంచి మేటి హోదాలు అందుతాయి

డీఆర్‌డీఓ సైంటిస్ట్‌-బి పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల డీఆర్‌డీఓ సైంటిస్ట్‌-బి పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల Reviewed by Admin on 10:39:00 Rating: 5
Powered by Blogger.